BALANANDAM
Tuesday, 16 October 2012
Thursday, 27 September 2012
తెలుగు బాలానందానికి స్వాగతం!!
'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి' అన్నారు. అంటే కన్నతల్లి, పుట్టిన దేశము స్వర్గం కంటె గొప్పవన్న మాట! అలాగే మాతృభాషను కుడా మనం ఎన్నటికీ విస్మరించ కూడదు. భారతదేశంలో రాష్ట్రాలన్నీ భాషాప్రయుక్త రాష్ట్రాలే! మన ఇరుగుపొరుగు రాష్ట్రాలన్నీ తమతమ భాషల మీద మమకారాన్ని పెంచుకుంటూ వాటి అభివృద్ధికి పాటుపడుతున్నాయి. అదేవిధంగా మనమాతృభాషలోని మధురఫలాలను రాబోయే తరాలకు అందివ్వ వలసిన బాధ్యత తెలుగువారమైన మనమీద ఉంది. అందుకే వీలైనంత సమాచారాన్ని అందివ్వడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ తెలుగుబాలనందం!!
ఇందులో తెలుగుబాలలకు ఆనందాన్ని పంచే వివిధ ప్రక్రియలతో పాటు తెలుగువారి ఆటపాటలు, సంస్కృతీసంప్రదాయాలను తెలియజేసే వివిధ పండుగలు, గేయాలు, కథలు, జాతీయాలు, సామెతలు, నాటికలు, చలోక్తులు, విజ్ఞాన వినోద విషయాలు..........ఇలా అనేకానేక ఆసక్తికర విషయాలను తెలియజేయడమే ఈ తెలుగుబాలానందం ముఖ్యోద్దేశం. ఇందులోని విషయాలను తెలుసుకొని, ఎంతోకొంత విజ్ఞానాన్ని సంపాదించి ఆనందించడమే కాకుండా మన తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పాలని ఆశిస్తున్నాను. బాలానందం పేరుతొ కేవలం బాలలకే కాకుండా ఆబాలగోపాలానికి ఆనందాన్ని పంచడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. ఈ నా చిన్ని ప్రయత్నంలో తోటి తెలుగుసోదరులంతా తమతమ అనుభవాలను, భావజాలాన్ని నాతొ పంచుకొని తగిన చేయూతనిస్తారని ఆశిస్తూ-----
మీ తెలుగుబాలానంద సోదరుడు.
Subscribe to:
Comments (Atom)